Madhuryame na prabhutho jeevitham మాధుర్యమే నా ప్రభుతో జీవితం



Song no: 21



    మాధుర్యమే నా ప్రభుతో జీవితం

    మహిమానందమే - మహా ఆశ్చర్యమే -2

    మాధుర్యమే నా ప్రభుతో జీవితం


  1. సర్వ శరీరులు గడ్డిని పోలిన - వారై యున్నారు -2

    వారి అందమంతయు -పువ్వువలె వాడిపోవును - వాడిపోవును ॥ మాధుర్యమే ॥




  2. నెమ్మది లేకుండ విస్తారమైన - ధనముండుట కంటె -2

    దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు ॥ మాధుర్యమే ॥




  3. వాడబారని కిరీటమునకై - నన్ను పిలిచెను -2

    తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో ॥ మాధుర్యమే






About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం