Mahima swarupuda mruthyumjayuda maranapu mullunu మహిమ స్వరూపుడా మృత్యుంజయుడామరణపుముల్లును



Song no: 34



    మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

    మరణపుముల్లును విరిచినవాడా

    నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములునీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు


  1. నీ రక్తమును నా రక్షణకై

    బలియాగముగా అర్పించినావు

    నీ గాయములద్వారా స్వస్థతనొంది

    అనందించెద నీలో నేను!!మహిమ స్వరూపుడా!!




  2. విరిగిన మనస్సు నలిగినా హృదయం

    నీ కిష్టమైన బలియాగముగా

    నీ చేతితోనే విరిచిన రోట్టెనై

    ఆహారమౌదును అనేకులకు!!మహిమ స్వరూపుడా!!




  3. పరిశుద్ధత్మ ఫలముపొంది

    పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై

    సీయోను రాజా నీ ముఖము చూడ

    ఆశతో నేను వేచియున్నాను !!మహిమ స్వరూపుడా!!







About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం