Nenu velle margamu nayesuke theliyunu నేను వెళ్ళేమార్గము నా యేసుకే తెలియును



Song no: 08



    నేను వెళ్ళేమార్గము - నా యేసుకే తెలియును -2

    శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను -2



  1. కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున -2

    గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు -2

    నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును




  2. జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు -2

    అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు -2

    నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును




  3. విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు -2

    సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు -2

    నేను వెళ్ళేమార్గము - నాయేసుకే తెలియును






About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం