Sathakoti vandhanalu yesu swamy neeku karuninchi శతకోటి వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్య



Song no:



    శతకోటి వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్య (2)

    కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు మా నిండు వందనాలయ్య (2)



    అనుపల్లవి :ఆ చల్లని చూపు మాపై నిలుపు నీ కరుణ హస్తం మాపై చాపు (2)



    1 యేసేపు అన్నలంత తోసేసినా బానిసగా బైట అమ్మేసిన చేయ్యని నేరాలెన్నో మోపేసిన చెరసాలలో అతని పడేసిన చల్లంగా చూచినావు నీ చేయి చాచినావు బాధించిన దేశానికే ప్రధాని చేసినావు (2) (ఆ చల్లని)



    2 ఆరుమూరల జానేదైనా గొల్యాతు ఎంతో ధీరుడైనా దేవుని హృదయానుసారుడైనా దావీదును చిన్న చూపుచూసినా చల్లంగా చూచినావు నీ చేయి చాచినావు అభిషేకమిచ్చి నీవే రాజుగా చేసినావు (2) (ఆ చల్లని)




About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం