Sarvaloka sampoojya namo namo సర్వ లోక సం పూజ్యా నమోనమో



Song no: #87



    సర్వ లోక సం పూజ్యా నమోనమో

    సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో

    సర్వ సత్య సారాంశా నమోనమో

    దేవా గావో || 4




  1. దీన భక్త మందారా నమోనమో

    దోష శక్తి సంహారా నమోనమో

    దేవా యేసావతార నమోనమో

    దేవా గావో || 4





  2. దేవలోక ప్రదీపా నమోనమో

    భావలోక ప్రతాపా నమోనమో

    పావనాత్మ స్వరూపా నమోనమో

    దేవా గావో || 4





  3. వేదవాక్యాదర్శ మీవె నమోనమో

    వేద జీవమార్గం బీవె నమోనమో

    వేదవాక్కును నీవే నమోనమో

    దేవా గావో || 4





  4. శాపగ్రహివైతివి నాకై నమోనమో

    ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో

    ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో

    దేవా గావో || 4




About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం