Sthothrinchi keerthinthumu halleluya స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ స్తుతి చెల్లించి



Song no: 202



    స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ

    స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ } 2



    అనుపల్లవి : గడచిన కాలమెల్ల - కంటిపాపవలె } 2

    కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్ } 2|| స్తోత్రించి ||


  1. పాపమును బాపినాడు హల్లెలూయ - మన

    శాపమును మాపినాడు హల్లెలూయ } 2

    కన్నతల్లివలెనె - కనికరించెను మమ్ము } 2

    యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్
    || స్తోత్రించి ||




  2. తల్లియైన మరచినను హల్లెలూయ - తాను

    ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ } 2

    ఎల్ల యీవుల నిచ్చి యుల్లాస మొసగును } 2

    కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్
    || స్తోత్రించి ||




  3. శోధన కాలములందు హల్లెలూయ - మన

    వేదన కాలములందు హల్లెలూయ } 2

    నాథుడు యేసు మన చెంతనుండ నిల
    } 2

    చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్
    || స్తోత్రించి ||




  4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు

    ఘోరముగ లేచినను హల్లెలూయ } 2

    దోనెయందున్న యేసు - దివ్యముగను లేచి } 2

    ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
    || స్తోత్రించి ||




  5. సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను

    సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ } 2

    చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు } 2

    చేర్చును కౌగిటిలో హల్లెలూయ ప్రభున్
    || స్తోత్రించి ||




About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం