Aarbatamutho pradhana dhutha sabbhamutho ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో





Song no: 171



    ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో  } 2


    మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు } 2


  1. అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము } 2

    అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు

    ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే } 2 || ఆర్భాటముతో ||




  2. పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము } 2

    సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు

    గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము } 2 || ఆర్భాటముతో ||




  3. వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము } 2


    ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో
    యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము } 2 || ఆర్భాటముతో ||







About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం