Naa marghamu naku dhipamaina na yesunitho sadha నా మార్గము నకు దీపమైన నా యేసుతో సదా సాగెద



Song no: 90

    నా మార్గము నకు దీపమైన
    నా యేసుతో సదా సాగెద


  1. గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2

    ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి

    ఆత్మనాధునితో సాగెదను } 2 || నా మార్గ ||




  2. నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2

    నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను

    నిరీక్షణతో నే సాగెదను } 2 || నా మార్గ ||




  3. సమస్తమైన  నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } 2

    నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన

    నా దేవునితో సాగెదను } 2 || నా మార్గ ||




  4. ప్రతి ఫలము నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును

    పలు శ్రమలందును విడవకుండ ప్రాణాత్మ దేహము సమర్పించి

    ప్రియుని ముఖము చూచి సాగెదను || నా మార్గ || 




About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం