Raja jagamerigina na yesu raja రాజ జగమెరిగిన నా యేసు రాజా




Song no: 112



    రాజ జగమెరిగిన నా యేసు రాజా

    రాగాలలో అనురాగాలు కురిపించిన

    మనబంధము అనుబంధము } 2

    విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? || రాజ || } 2



  1. దీన స్థితియందున సంపన్న స్థితియందున

    నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే } 2

    నిత్యము ఆరాధనకు నా ఆధారమా

    స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||




  2. బలహీనతలయందున అవమానములయందున

    పడినను కృంగినను నీకృప కలిగియుందునే } 2

    నిత్యము ఆరాధనకు నా ఆధారమా

    స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||




  3. సీయోను షాలేము మన నిత్య నివాసము

    చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే } 2

    నిత్యము ఆరాధనకు నా ఆధారమా

    స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2 || రాజ ||









About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం