Vardhiledhamu mana devuni mandhiramandhu వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు



Song no: 113



    వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడినవారమై

    నీతిమంతులమై మొవ్వు వేయుదము

    యేసురక్తములోనే జయము మనకు జయమే

    స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే



  1. యెహోవా మందిర ఆవరణములో ఎన్నోన్నె మేళ్ళు గలవు

    ఆయన సన్నిధిలోనే నిలిచి - అనుభవింతుము ప్రతిమేలును || వర్ధిల్లెదము ||




  2. యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ గలదు

    ఆయన సముఖములోనే నిలిచి - పొందెదము శాశ్వత కృపను || వర్ధిల్లెదము ||




  3. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు

    ఆయన మహిమైశ్వర్యము మన - దుఃఖము సంతోషముగ మార్చును || వర్ధిల్లెదము ||





About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం