Seeyonu raraju thana swasthyamu korakai సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై




Song no: 131



    సీయోను రారాజు తన స్వాస్థ్యము కొరకై

    రానై యుండగా త్వరగా రానై యుండగా



    సంపూర్ణ సిద్ధి నొంద స్థిరపడెదము

    సంఘసహవాసములో ప్రేమసామ్రాజ్యములో } 2 || సీయోను ||



  1. వివేచించుమా భ్రమపరచు ప్రతి ఆత్మను

    ఏర్పరచబడినవారే తొట్రిల్లుచున్న కాలమిదే } 2

    వీరవిజయముతో నడిపించుచున్న పరిశుద్ధాత్మునికే

    విధేయులమై నిలిచియుందుము } 2 || సీయోను ||




  2. అధైర్యపడకు వదంతులెన్నో విన్నాను

    ఆత్మభిషేకము కలిగి కృపలో నిలిచే కాలమిదే } 2

    నిత్యమహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో

    నిరంతరము ఆనందించెదము } 2 || సీయోను ||




  3. ఆశ్చర్యపడకు ఆకాశశక్తులు కదలినను
    దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యె కాలమిదే } 2
    ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ
    రూపంతరము మనము పొందెదము } 2 || సీయోను ||










About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం