Thriyeka devudaina yehovanu kerubulu త్రియేకదేవుడైన యెహోవాను కెరూబులు




Song no: 136


HD






    త్రియేక దేవుడైన యెహోవాను

    కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు

    పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని

    గాన ప్రతి గానములు చేయుచు ఉండును



  1. నా శాపము బాపిన రక్షణతో

    నా రోగాల పర్వము ముగిసేనే

    వైద్య శాస్త్రములు గ్రహించలేని

    ఆశ్చర్యములెన్నో చేసినావే || త్రియేక ||




  2. నా నిర్జీవ క్రియలను రూపు మాపిన

    పరిశుద్ధాత్మలో ఫలించెదనే

    మేఘ మధనములు చేయలేని

    దీవెన వర్షము కురిపించినావే || త్రియేక ||




  3. నా స్థితిని మార్చిన స్తుతులతో

    నా హృదయము పొంగిపొర్లేనే

    జలాశయములు భరించలేని

    జలప్రళయములను స్తుతి ఆపెనే || త్రియేక ||





About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం