Janulara sthuthiyinchudi iedhi yesukreesthuni జనులారా స్తుతియించుడి ఇది యేసుక్రీస్తుని




Song no:


HD




    జనులారా స్తుతియించుడి

    ఇది యేసుక్రీస్తుని జన్మదినం

    ప్రజలారా సేవించుడి

    ఇది రక్షకుడు వెలసిన పర్వదినం } 2



  1. పాపుల శాపపు భారముకై

    దేవుడు వెలసిన దివ్యదినం

    పాప శాప విమోచనకై

    దైవము వెలసిన మహాదినం } 2 || జనులారా ||




  2. ఆశ నిరాశలలో కృంగిన లోకములో

    ఆశ నిరాశలతో కృంగిన లోకములో



    ఆధరణకర్తగా

    ప్రభు వెలసిన దివ్యదినం } 2 || జనులారా ||




  3. రాజుల రాజునిగా

    ప్రభువుల ప్రభువునిగా } 2

    భువినేలు రారాజుగా

    ప్రభు వెలసిన పర్వదినం } 2 || జనులారా ||




About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం