Song no: 111
- సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి పెనుతుఫానులెన్నో
- సుడిగుండాలెన్నో లోకసాగరాన
వడిగా నను లాగి పడద్రోసే సమయాన } 2
నడిపించగలిగిన నా చుక్కాని నీవే } 2
విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే } 2
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2 || సాగేటి || - వడగాడ్పులెన్నో నా పయనంలోన
నడవనీక సొమ్మసిల్లజేసే సమయాన } 2
తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే } 2
కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే } 2
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2 || సాగేటి || - అలలా శ్రమలెన్నో బ్రతుకు నావ పైన
చెలరేగి విలవిలలాడించే సమయాన } 2
నిలబెట్టి బలపరచే బలవంతుడ నీవే } 2
కలవరమును తొలగించే కన్నతండ్రి నీవే } 2
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2 || సాగేటి ||
ఆదరించవా నీ జీవవాక్కుతో - సేదదీర్చవా నీ చేతి స్పర్శతో
