Samvastharamulu gathiyinchina needhu krupa nannu సంవత్సరములు గతియించినా నీదు కృప నన్ను




Song no:


HD




    సంవత్సరములు గతియించినా

    నీదు కృప నన్ను విడువలేదయ్యా } 2

    యేసయ్య నీకృపతోనే నన్ను కాపాడినావు } 2

    నీ దయలోనే నన్ను దాచినావయ్యా } 2

    ఆరాధనా స్తోత్రముల్

    హల్లెలూయా వందనం } 2

    హల్లెలూయా వందనం || సంవత్సరములు ||



  1. ఆపద కాలములో నన్ను అదుకున్నావు

    కష్ట కాలములో నన్ను విడిపించావు } 2

    నీకు నేను మొఱ్ఱ పెట్టుకొనగా

    కనుపాపల కాపాడినావు } 2

    కృప చూపినవాడవు దయచూపినవాడవు

    రక్షించినవాడవు యేసయ్యా

    ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ || సంవత్సరములు ||




  2. మనో వేదనలో క్రుంగిపోవుచుండగా

    ఆదరించు వారు లేక

    కుమిలిపోవుచుండగా } 2

    నీ సన్నిధి నాతోడు ఉంచీ

    కృప వెంబడి కృప లెన్నో చూపి } 2

    వేదన తీర్చావుగా బాధలు తీశావుగా అదుకున్నావుగా యేసయ్య

    ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ || సంవత్సరములు ||




  3. నూతన క్రియలు జరిగించినావు

    నూతన అభివృద్ధిని దయచేసినావు

    దయాకిరీిటము నాపై నిలిపీ

    సమయోచిత సాయములను చేసీ    " 2 "

    దీవించినావుగా బలపరచినావుగా

    హెచ్చించినావుగా యేసయ్యా

    ఏమివ్వగలనూ నేనేమివ్వగలనూ || సంవత్సరములు ||







 

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం