Oh... manavunda nee gathi yemauno teliyuna ఓ…మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా




Song no:


HD




    ఓ…మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా

    ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ?


    ఆహా…. ఆ…ఆ…అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే

    మహా భయంకరమో – సింహంబుగా నుండు } 2



  1. లోకాలు పుట్టి నప్పటి – నుండి మృతులైనా } 2

    ఏ కులాజుడైన నాటికి – తీర్పులో నిలచును || ఆహా…. ఆ… ||





  2. మృతులైన ఘనులు హీనులు – యేసయ్య యెదుటను } 2

    ప్రతివారు నిలచి యుందురు – బ్రతికిన రీతిగనే || ఆహా…. ఆ… ||





  3. గ్రంధాలు విప్ప బడగ – గ్రంధాలలో వారి } 2

    గ్రంధంబు బట్టబయలై – పొందుదురు తీర్పును || ఆహా…. ఆ… ||





  4. నరులెల్ల క్రియల చొప్పున – మరి తీర్పు పొందుదురు } 2

    మరణము మృతుల లోకము – గురియౌను అగ్నికి || ఆహా…. ఆ… ||





  5. ఈ నాడు నీవు కూడను – యేసుని విడచినచో } 2

    ఆనాడు నీవు కూడను – అందుండి యేడ్చెదవు || ఆహా…. ఆ… ||





  6. దేవుని జీవ గ్రంధము – దేవుడు తెరచున } 2ు

    ఎవ్వని పేరందుండదో – వాడగ్నిలో బడును || ఆహా…. ఆ… ||
    || goto ||



About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం