Mahonnathuni chatuna nivasinchuvade మహోన్నతుని చాటున నివసించువాడే












Song no:

    మహోన్నతుని చాటున నివసించువాడే

    సర్వశక్తుని నీడను విశ్రమించువాడు } 2



    ఆయనే నా ఆశ్రయము ఆయనే నా కోట

    నేను నమ్ముకొనిన దేవుడు యేసయ్య } 2



  1. వేటకాని ఉరినుండి నన్ను విడిపించును

    నాశనకరమైన తెగులు రాకుండా చేయును} 2

    తన రెక్కలతో నను కాయును

    తన రెక్కల నీడలో ఆశ్రయము కలుగును

    || ఆయనే నా ఆశ్రయము ||




  2. నేను మొఱ్ఱపెట్టగా నాకు ఉత్తరమిచ్చును

    శ్రమలలో ఆయన నాకు తోడైయుండెను } 2

    నన్ను విడిపించి గొప్ప చేసెను

    రక్షణానందం నాకు చూపెను } 2

    || ఆయనే నా ఆశ్రయము ||













Song no:























About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం