Yentha krupamayudavu yesayya prema chupi ఎంత కృపామయుడవు యేసయ్యా ప్రేమ చూపి నన్ను



Song no:



    ఎంత కృపామయుడవు యేసయ్యా – ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా /2/
    నలిగితివి వేసారితీవి – నలిగితివి వేసారితీవి /2/
    నాకై ప్రాణము నిచ్చితివి – నాకై ప్రాణము నిచ్చితివి /2/
  1. బండ లాంటిది నాదు మొండి హృదయం- ఎండిపోయిన నాదు పాప జీవితం /2/
    మార్చితివి నీ స్వాస్త్యముగ /2/ – ఇచ్చినావు మెత్తనైనా కొత్తహృదయం /2/ఎంత/

  2. వ్యాధి బాధలందు నేను క్రుంగీయుండగా – ఆదరించెను నీ వాక్యము నన్ను /2/
    స్వస్ఠపరచెను నీ హస్తము నన్ను/2/ ప్రేమతో పిలచిన నాధుడవు /2/

  3. కన్న తల్లి తండ్రులు నన్ను విడచినను – ఈ లోకము నను వెలివేసిన /2/
    మరువలేదు నన్ను విడువలేదు /2/ – ప్రేమతో పిలచిన నాధుడవు /2/ ఎంత/

  4. ఆదరణ లేని నన్ను ప్రేమించితివి- అభిషేకించితివి ఆత్మలోను /2/
    నిలచుటకు ఫలించుటకు /2/ – అత్మతో నను ముద్రించితివి /2/ ఎంత/



About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం