Krupanidhi neeve yesayya dheenula yedala కృపానిధి నీవే యేసయ్య దీనుల యెడల




Song no:


HD




    కృపానిధి నీవే యేసయ్య

    దీనుల యెడల కృపచూపు వాడవు } 2

    పరిశుద్ధతలో మహనీయుడా

    స్తుతికీర్తనలతో పూజింతును } 2



    నా మనసారా నిన్నే స్తుతియింతును

    నా ఆరాధనా నీకే నా యేసయ్య } 2 || కృపానిధి నీవే ||



  1. దివిలో నీకున్న మహిమను విడిచి

    దీనులపై దయచూప దిగివచ్చినావు } 2

    దయాళుడా నా యేసయ్య

    నీ దయనొంది నేను ధన్యుడనైతిని } 2 || నా మనసారా ||




  2. సత్యస్వరూపియగు ఆత్మను పంపి

    పరలోక ఆనందం భువిపై దించితివి } 2

    ప్రశాంతుడా నా యేసయ్య

    నీ ఆత్మను పొంది పరవశమొందితిని } 2 || నా మనసారా ||




  3. మహాదేవుడా నా ప్రియా యేసు

    నీ రాకకై నేను వేచియున్నాను } 2

    పరిశుద్ధుడా నా యేసయ్య

    నీతో జీవించుట నా ధన్యత ఆయను } 2 || నా మనసారా ||





About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం