Thallikunnadha thandrikunnadha nee prema jali yesayya తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమజాలి యేసయ్యా



Song no:




    తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమజాలి యేసయ్యా

    అన్నదమ్ములకైనా కన్నబిడ్డలకైనా నీ ప్రేమలేదు యేసయ్యా } 2


    యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా

    యేసయ్యా యేసయ్యా  నా మంచి యేసయ్యా } 2 || తల్లికున్నదా ||



  1. ఏ యేగ్యత లేదనుచూ నా అనువారే
    ఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యా } 2
    రోగముతో రోధిస్తూ వేధనపడుచుండగా

    అవహేళన చేసితిరీ బంధువులయ్యా } 2

    నేను ప్రేమించకయే నన్నుప్రేమించితివీ

    నా పరమవైధ్యుడ నీవయ్యా } 2 || యేసయ్యా ||




  2. ఏమంచిలేని నన్ను మంచిగ ప్రేమించి

    నీ ఇంటికి చేర్చితివీ ఈనాడయ్యా } 2

    జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా

    మనిషిగా నిలిపితివీ మనుగడనిచ్చీ  } 2

    నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివీ

    నా మంచి కాపరినీవయ్యా || యేసయ్యా ||









About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం