Yesu rakthame jayamu jayamu raa siluva rakthame యేసు రక్తమే జయము జయము రా శిలువ రక్తమే




Song no:

    యేసు రక్తమే జయము జయము రా….

    శిలువ రక్తమే జయము జయము రా…



    ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపెనురా….

    తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా…. ||2|| || యేసు ||



  1. బలహీనులకు బలమైన దుర్గం, ముక్తి యేసు రక్తము….

    వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వస్తత యేసు రక్తము…..

    శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం-నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం ||2||

    మృత్యువునే.. గెలిచిన రక్తము… పాతాలం మూయు రక్తము

    నరకాన్ని బంధిచిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే || యేసు ||




  2. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము…

    అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము….

    శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు?-ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు ||2||

    సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా

    కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే || యేసు ||






About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం