Naa prarthanalanni alakinchinavu na sthuthihomamulanni నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతిహోమములన్ని




Song no: 130



    నా ప్రార్థనలన్ని ఆలకించినావు

    నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము



    నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను

    నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు } 2 || నా ప్రార్థనలన్ని ||



  1. అడిగినంతకంటె అధికముగా చేయు

    ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా } 2

    పరిపూర్ణమైన నీ దైవత్వమంతా

    పరిశుద్ధతకే శుభ ఆనవాలు } 2 || నా ప్రార్థనలన్ని ||




  2. ఆపత్కాలములో మొరపెట్టగానే

    సమీపమైతివే నా యేసయ్యా } 2

    సమీప భాందవ్యములన్నిటికన్నా

    మిన్నయైనది నీ స్నేహబంధము } 2 || నా ప్రార్థనలన్ని ||




  3. ఎక్కలేనంత ఎత్తైన కొండపై

    ఎక్కించుము నన్ను నా యేసయ్యా } 2

    ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు

    ఆత్మీయతకే స్థిరపునాదులు } 2 || నా ప్రార్థనలన్ని ||





About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం