Nithyamaina mahimanu veedi kotla నిత్యమైన మహిమను వీడి కోట్ల

Song no:

HD

    నిత్యమైన మహిమను వీడి - కోట్ల దూత గణములనొదిలి

    నీతిని స్థాపించుటకు - దివి నుండి భువికి వచ్చెను } 2

    భువి నడిబొడ్డున - బేత్లెహేము పురి గడ్డపై

    క్రీస్తు యేసను నరునిగా - మన రాజు జన్మించెను } 2

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్

    హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||

  1. దీనులకు రక్షణ వస్త్రము - కప్పు రక్షకుడు

    మరణ ఛాయ నుండి - గొప్ప వెలుగుకు నడిపే మన నాయకుడు } 2

    మహా సంతోషకరమైన - సువర్తమానమును

    దూతలచేత పంపెను - పొలములోని గొల్లలకు } 2

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్

    హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||

  2. తూర్పు దేశ జ్ఞానులను సహితము - పిలిచినవాడు

    రాజరికపు పాలనకై రాజులను - సిద్ధపరిచే మన రారాజు } 2

    అత్యానందభరితమైన - క్షణములను చూచుటకు

    నక్షత్రముచే నడిపెను - యూదయ దేశపు రాజుయొద్దకు } 2

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్

    హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||

  3. నశించినవారిని సహితము - వెదకి పిలుచుటకు

    దివి నుండి భువికి తండ్రి చేత పంపబడెనే - మన రక్షకుడు } 2

    ఎందరో పాపులను క్షమియించి - పాపుల స్నేహితుడాయెను

    జక్కయ్యలో మార్పు - ఆ దినమే ఆరంభమాయెను } 2

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్

    హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం