Nee vaipu chusthu ninne sevinchani నీవైపు చూస్తూ నిన్నే సేవించనీ



Song no: 131



    నీ వైపు చూస్తూ నిన్నే సేవించనీ

    నిన్ననుసరిస్తూ నీకై జీవించనీ

    నీలోనే నను నిలిపి ఫలియించనీ

    నీ సేవలో గడిపి తరియించనీ {నీ వైపు చూస్తూ}


  1. నీ సహవాసము ఆనందమయము

    నీ సన్నిధిలో లేదే భయము } 2

    నీ ఆలోచన నాకెంతో ప్రియము

    నీయందే నా అతిశయము



    నీ కృపకంటే మించినదే లేదయ్యా

    నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా } 2 {నీ వైపు చూస్తూ}



  2. నీ చేతికార్యము ఆశ్చర్యకరము

    నీ నీతివాక్యము ఎంతో స్థిరము

    నీ కనికరము ధరణికి వరము

    నీ ప్రేమ నిలుచు నిరంతరము {నీ కృపకంటే}



  3. నీ జీవమార్గము చేర్చును స్వర్గము

    నీ కుడిహస్తము కూర్చును సౌఖ్యము

    నీ నామమందే రక్షణ భాగ్యము

    నీ దీవెనొందే బ్రతుకు ధన్యము {నీ కృపకంటే}








About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం