Yevadandi babu veedu yentha cheppina vinadu ఎవడండీ బాబూ వీడు ఎంత చెప్పినా వినడు



Song no: 120



    ఎవడండీ బాబూ వీడు - ఎంత చెప్పినా వినడు

    గుప్పుగుప్పున వదిలేస్తాడు - తప్పంటే అసలొప్పుకోడు


  1. తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు

    పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమాంటాడు } 2

    దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచేడు } 2

    గుండె తూట్లు పడ్డగాని దాన్ని మాత్రం విడువడు } 2 {ఎవడండీ}




  2. సరదా అంటూ మొదాలు పెడతాడు మల్లా దానికే బానిసౌతాడు

    డబ్బులన్ని తగలబెడతాడు కోరి జబ్బులెన్నో తెచ్చుకుంటాండు } 2

    ఆరోగ్యమే క్షిణిస్తున్నా కళ్ళు మాత్రం తెరవడు } 2

    శక్తి అంతా కోల్పోతున్నా ఎంతమాత్రం వెరవడు } 2 {ఎవడండీ}





  3. దేహమే దేవదేవుని నివాసమని మర్చిపోతాడు

    పరిశుద్దంగ ఉంచుమనే క్రీస్తు ఆజ్ఞనే లెక్కచేయడు } 2

    పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు } 2

    యేసుక్రీస్తుని నమ్మినచో పరిశుద్ధుడు తానౌతాడు } 2 {ఎవడండీ}






About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం