Yentha sundharamo a paralokamu antha suvarname ఎంత సుందరమో అ పరలోకము అంతా సువర్ణమే



Song no: 119



    ఎంత సుందరమో అ పరలోకము అంతా సువర్ణమే } 2

    ఏమి చిత్రముచేరాలనుకుంటే ఆ పట్టణము } 2

    యేసయ్యకివ్వాలి నీ హృదయము } 2 {ఎంత సుందరమో}


  1. కాంతినిచ్చుటకు సూర్యుడు అవసరమేలేదు

    వెన్నలిచ్చుటకు చంద్రుడు అవసరమే లేదు } 2

    దేవుని మహిమయె అచట ప్రకాశించుచుండెను } 2

    జనములుఆ వెలుగునందు సంచరించుచుందురు } 2 {ఎంత సుందరమో}



  2. ఆకలి దాహము ఉండనే ఉండవు చీకటి రోగము ఉండనే ఉండవు } 2
    ప్రభువైన దేవుడే వారితో నివసించును } 2

    కన్నీటి బిందువులను తానే తుడిచివేయును } 2 {ఎంత సుందరమో}



  3. శాపగ్రస్తమైనడదేది అందులో ఉండదు
    అసహ్యమైనది ఏది అందులో ఉండదు } 2
    జీవగ్రంధమందు రాయబడినవారే ఉందురు } 2
    ఆయననుసేవించుచు రాజ్యమే చేతురు } 2 {ఎంత సుందరమో}





About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం