Yekkara oranna rakshana padava chakkaga mokshaniki cherccheti nava ఎక్కరా ఓరన్నారక్షణ పడవ చక్కగా మోక్షానికి చేర్చేటి నావ



Song no: 122



    ఎక్కరా ఓరన్నారక్షణ పడవ - చక్కగా మోక్షానికి చేర్చేటి నావ } 2


  1. తండ్రియైున దేవుడు నిర్మించినాడురా

    యేసుక్రీస్తు దేహాన్ని మలిచి కట్టినాడురా } 2

    పరిశుద్ద రక్తంతో సిద్దామైన పడవరా } 2

    దరిచేర్చగలిగిన ఏకైక నావరా } 2 {ఎక్కరా}



  2. ఎందరెక్కినా దానిలో చోటుంటుందిరా

    అందారిని ప్రేమతో రమ్మంటుందిరా } 2

    నిత్యజీవాన్నిచ్చే నిజమైన పడవరా } 2

    సత్యమైన మార్గాన సాగేటి నావరా } 2 {ఎక్కరా}



  3. శాపాలు పాపాలు దానిలోకి చేరవురా

    చావు భయమే అందు మరి ఉండబోదురా } 2

    శిక్ష నుండి తప్పించే మహిమగల పడవరా } 2

    అక్షయ భాగ్యమిచ్చే అనురాగ నావరా } 2 {ఎక్కరా}





About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం