Dheevinchumo deva na manchi yesu deva దీవించుమో దేవా నా మంచి యేసు దేవా




Song no:


HD




    దీవించుమో దేవా నా మంచి యేసు దేవా

    ప్రియమైన క్రీస్తు ప్రభువా ప్రార్థింతు నిన్నేనయా

    ఆలించు నా యేసయ్య ప్రార్థింతు నిన్నేనయా

    ఆలించు నా యేసయ్య దీవించుమో దేవా



  1. నీ ప్రేమయే నీ కృపయే నాదు జీవము నొసగెను

    నీ నామమే నీ వాక్యమే నాకు త్రోవను చూపెను } 2

    పాపముతో శాపముతో నలిగాను నా బ్రతుకులో

    కాపరివై దేవుడవై నిలిచావు నా మనసులో } 2

    నా దాగు చోటు నీవే నా నీతి బాట నీవే



    కీర్తింతు నీ నామము ప్రేమింతు నీ మార్గము } 2




  2. కృతజ్ఞత స్తుతులతో నిన్ను నేను స్తుతించెద

    పాటలు పాడుచు నాట్యమాడుచు నీదు సన్నిధి చేరెద } 2

    కష్టాలైనా కన్నీరైనా నిన్ను విడువలెనేసయ్య

    కరువైనా భారమైనా నిన్ను మరువలేనేసయ్య } 2

    నా దాగు చోటు నీవే నా నీతి బాట నీవే



    కీర్తింతు నీ నామము ప్రేమింతు నీ మార్గము } 2



    దీవించుమో దేవా నా మంచి యేసు దేవా

    ప్రియమైన క్రీస్తు ప్రభువా ప్రార్థింతు నిన్నేనయా

    ఆలించు నా యేసయ్య ప్రార్థింతు నిన్నేనయా

    ఆలించు నా యేసయ్య దీవించుమో దేవా




About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం