Na jeevitha bagaswamivi neevu na pranamutho నా జీవిత భాగస్వామివి నీవు నా ప్రాణముతో




Song no: 95



    నా జీవిత భాగస్వామివి నీవు

    నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు } 2

    నాకే సమృద్దిగా నీ కృపను పంచావు

    నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా } 2



  1. నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి

    నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి } 2

    నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి

    నీ సైన్యములో నన్ను చేర్చితివి } 2 || నా జీవిత ||




  2. నీ దయగల మాటలే చేరదీసినవి

    నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి } 2

    నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి

    నీ విందుశాలకు నను చేర్చితివి } 2 || నా జీవిత ||




  3. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి

    నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి } 2

    నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు

    నీ అంతఃపురములో నను చేర్చుదువు || నా జీవిత ||





About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం