Pravahinchuchunnadhi prabhu yesu raktham ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం




Song no: 119



    ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం

    పాపములన్నియు కడుగుచున్నది } 2

    పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది } 2



  1. దుర్ణీతి నుండి విడుదలచేసి

    నీతిమార్గాన నిను నడిపించును } 2

    యేసురక్తము క్రయధనమగును

    నీవు ఆయన స్వస్థమౌదువు } 2 || ప్రవహించుచున్నది ||




  2. దురభిమానాలు దూరముచేసి

    యథార్థ జీవితం  నీకనుగ్రహించును } 2

    యేసురక్తము నిర్దోషమైనది

    నీవు ఆయన ఎదుటే నిలిచెదవు } 2 || ప్రవహించుచున్నది ||




  3. జీవజలముల నది తీరమున

    సకలప్రాణులు బ్రతుకుచున్నవి } 2

    యేసురక్తము జీవింపజేయును

    నీవు ఆయన వారసత్వము పొందెదవు } 2 || ప్రవహించుచున్నది ||





About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం