Yesu devuni asrayinchuma sodhara sodhari యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ

Song no:

HD

    యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే

    విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే

    స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత

    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమార్గాన

  1. రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను

    మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను

    విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును } 2

    యేసు నందు విశ్వాసముంచుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత

    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

  2. దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను

    మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను

    నీవు అడుగుము నీకివ్వబడును } 2

    యేసుని ప్రార్థించుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత

    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

  3. శోధనలెన్నైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా

    యధారతకు నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను

    సహసము చూపుము సమకూడి జరుగును } 2

    యేసు నందు నిరీక్షించుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత

    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

    యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే

    విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే

    స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా

About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం