Naa arpanalu neevu parishuddhaparachuchunnavani నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని




Song no: 128



    నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని

    యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద } 2

    నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని } 2



  1. ఆధారణలేని ఈ లోకములో

    ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే } 2

    అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో

    అరణ్యవాసమే  మేలాయెనే } 2 || నా అర్పణలు ||




  2. గమ్యమెరుగని వ్యామోహాలలో

    గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే } 2

    గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో

    షాలేము నీడయే నాకు మేలాయెనే } 2 || నా అర్పణలు ||




  3. మందకాపరుల గుడారాలలో

    మైమరచితినే మమతను చూపిన నీపైనే } 2

    మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో

    సీయోనుధ్యానమే నాకు మేలాయెను } 2 || నా అర్పణలు ||






About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం