Neevugaka yevarunnaru naku ielalo yesayya నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య




Song no: 122



    నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2

    నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2



  1. ఘోరపాపముతో నిండిన నా హృదిని

    మార్చితివే  నీదరి చేర్చితివే } 2

    హత్తుకొని ఎత్తుకొని

    తల్లివలె నన్ను ఆదరించితివే } 2 || నీవుగాక ||




  2. అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో

    వెదకితివే నావైపు తిరిగితివే } 2

    స్థిరపరచి బలపరచి

    తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2 || నీవుగాక ||









About Online Lyrics List

పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం